News

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

240views

శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్ నుంచి విజయవాడ మీదుగా కొల్లం వరకు 44 వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం-కొల్లాం (08539) ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతి బుధ వారం నడపనున్నారు. ఈ రైలు ప్రతి బుధవారం విశాఖపట్నంలో బయ లుదేరి, మరుసటి రోజు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08540) డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి గురువారం రాత్రి బయలు దేరుతుంది. శ్రీకాకుళం రోడ్-కొల్లాం (08553) ప్రత్యేక రైలు డిసెం బర్ 1 నుంచి జనవరి 26 వరకు ప్రతి ఆదివారం నడుపుతారు. శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి, మరుసటి రోజు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయా ణంలో ఈ రైలు (08554) డిసెంబర్ 2 నుంచి జనవరి 27 వరకు ప్రతి సో మవారం సాయంత్రం 4.30 గంటలకు కొల్లాంలో బయలు దేరుతుంది.