
పొరుగు దేశం శ్రీలంకకు చెందిన ఓ విమానయాన సంస్థ రామాయణంపై రూపొందించిన ఓ అద్భుతమైన ప్రచార చిత్రం (యాడ్) ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. శ్రీలంకలోని రామాయణ ఇతిహాసంతో సంబంధం ఉన్న అన్ని ప్రదేశాలకు పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఒక సర్వీస్‌ను శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఇటీవల ప్రారంభించింది. ‘ద రామాయణ ట్రెయిల్స్’ పేరిట ప్రారంభించిన ఈ సర్వీస్‌ను ప్రమోట్ చేయడానికి ఎయిర్‌లైన్స్ ఓ మంచి ప్రచార చిత్రాన్ని రూపొందించింది.
ఆ యాడ్‌లో ఓ పెద్దావిడ తన మనవడికి రామాయణాన్ని బొమ్మల రూపంలో వివరించడం మనం చూడొచ్చు. ఆ సమయంలో శ్రీలంకలోని రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలను చూపించారు. అలాగే రామసేతువును కూడా చూపించడం జరిగింది. కనులవిందుగా 5 నిమిషాల నిడివితో ఈ ప్రచార చిత్రాన్ని చిత్రీకరించారు.
ఈ ప్రస్తుతం ఈ యాడ్ తాలూకు వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు శ్రీలంక విమానయాన సంస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Relive the epic of The Ramayana Trail
Embark on a journey through Sri Lanka’s legendary landscapes with SriLankan Holidays, offering a fully customized experience tailored just for you. Every step of your adventure is designed to bring out the grandeur and glory in the ancient… pic.twitter.com/jctUhc4JKn
— SriLankan Airlines (@flysrilankan) November 8, 2024





