News

కాశ్మీర్లో నక్కిఉన్న 273 మంది ఉగ్రవాదులు .

649views

రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఒక్క కశ్మీర్‌లోనే 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని నిఘావర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భద్రత నడుమ ఉన్న కశ్మీర్‌ లోయలో హింస సృష్టించేందుకు వీరంతా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించారు. వేర్వేరు ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు రానున్న రోజుల్లో పేలుళ్లు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లో 158 మంది, ఉత్తర కశ్మీర్‌లో 96, కశ్మీర్‌ మధ్య ప్రాంతంలో 19 మంది ఉగ్రవాదులను గుర్తించినట్లు నిఘావర్గాలు తమకు వెల్లడించాయని ఓ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఉగ్రవాదుల్లో 166 మంది స్థానికులుకాగా, మరో 107 మంది విదేశీయులుగా గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కర్‌-ఎ-తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులు మొత్తం సంఖ్యలో 112 మంది ఉన్నారు. మరో 100 మంది హిజ్బుల్‌ ముజాహిదీన్‌, 59 మంది జైష్‌-ఎ-మహ్మద్‌, ముగ్గురు ఇస్లామిక్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ అయిన అల్‌-బదర్‌కు చెందిన వారు ఉన్నారని నిఘావర్గాలు గుర్తించారు.
జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేశాక ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్‌ కుయుక్తులు పన్నుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి 30 ఉగ్రవాద శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లు కొద్ది రోజుల క్రితం నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్‌కు చెందిన ఆర్మీ, ఐఎస్‌ఐ సంస్థలు ఇతర ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను ఈ శిబిరాలకు తరలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Source: Enadu.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.