News

దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ప్రసాదం

258views

విజయవాడ దసరా ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక బాక్స్‌ ప్యాకింగ్‌లో లడ్డూలను విక్రయిస్తోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్‌లోని లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లలో ఈ లడ్డూ బాక్సులు అందుబాటులోకి ఉంచారు. ఒక్కో లడ్డూ ఖరీదు రూ. 15 కాగా ఆరు లడ్డూలుగల బాక్స్‌ రూ.100కు విక్రయిస్తున్నారు. గతంలో వీఐపీలకు ఇచ్చే లడ్డూలను మాత్రమే ప్రత్యేక ప్యాకింగ్‌ రూపంలో అందించేవారు. లడ్డూ బాక్స్‌ కొనుగోలు చేసిన తర్వాత తెలిసిన వారికి ప్రసాదం ఇచ్చేందుకు వీలుగా బాక్స్‌లోనే ఆరు లడ్డూ కవర్లు ఉంచుతుంది. దేవస్థానం కొత్తగా ఏర్పాటు చేసిన బాక్సులను భక్తులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు.