ArticlesNews

ఉమ్మడి కుటుంబం ఎనలేని ప్రయోజనం

15views

కుటుంబ ప్రభోధన్

ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు. ఇలా కుటుంబాల మధ్య విభేదాలు వల్ల కుటుంబంలో చీలికలు ఏర్పడుతున్నాయి. అయితే నూటికి ఏ ఒక్క శాతం మంది మాత్రమే ఉమ్మడి కుటుంబంలో కలిసి నివసిస్తున్నారు.అయితే ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు కనుక తెలిస్తే ఏ ఒక్కరు కూడా వేరు కాపురం పెట్టరు.

ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లలకు చిన్నప్పటి నుంచి కుటుంబం యొక్క విలువలు అలాగే పెద్దలను ఎలా గౌరవించాలి అనే విషయాల గురించి తెలుస్తాయి.తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్తే చిన్నారుల ఆలనా పాలన చూసుకోవడానికి ఇంట్లో పెద్దవారు ఉంటారన్న భరోసా ఉంటుంది. ఇక ఆర్థిక విషయంలో కూడా ఒకరికొకరు ఎంతో సహాయంగా ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల ఒకరి పట్ల మరొకరికి ప్రేమానురాగాలు ఉంటాయి.

ఉమ్మడి కుటుంబంలో అన్ని వయసుల వారు ఉండటం వల్ల పెద్దలను ఎలా గౌరవించాలో తెలుస్తుంది దీంతో సమాజంలో కూడా మనల్ని మనం గౌరవించుకోబడతాము.ఉమ్మడి కుటుంబంలో జీవించడం వల్ల ఇంట్లో పెద్దవారితో కాస్త సమయం గడపడమే కాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులను తెలుసుకొని మన జీవితంలో అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కట్టుబాట్లు సంస్కృతి సాంప్రదాయాలను కూడా మర్చిపోకుండా ఉంటాము. ఇక ఇంట్లో ఒక వ్యక్తి తన పిల్లలపై ఆగ్రహం తెచ్చుకున్నప్పుడు వారికి ఒంటరి అయ్యాం అనే భావన రాదు. ఎందుకంటే, వారిని మరొకరు అక్కున చేర్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలో ఎప్పుడూ కూడా ఒంటరి అనే భావన కలగకుండా ఉంటుంది. ఇలా ఉమ్మడి కుటుంబం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి.