News

త్రిపురలో 500 మంది మిలిటెంట్ల లొంగుబాటు

59views

త్రిపుర విమోచన జాతీయ కూటమి (ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ), ఆల్‌ త్రిపుర టైగర్‌ ఫోర్స్‌ (ఏటీటీఎఫ్‌)కు చెందిన దాదాపు 500 మంది ముష్కరులు తమ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. సిపాహీజాలా జిల్లాలోని జంపుయిజాలాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ముందు ఆయుధాలను త్యజించారు. వీరంతా సామూహికంగా లొంగిపోవడంతో ఈశాన్య రాష్ట్రం పూర్తిగా సాముధమూకల రహితంగా మారిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా వెల్లడించారు. ‘వివిధ పథకాలను ప్రవేశపెడుతూ ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం కృషి చేస్తున్నాయి. హింసామార్గాన్ని వీడి జనజీవనంలో కలిసిన వారిని నేను స్వాగతిస్తున్నాను’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఆయుధాలను త్యజించిన మిలిటెంట్ల పునరావాసం కోసం కేంద్రం రూ.250 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.