News

వినీలాకాశంలో సూపర్ బ్లూమూన్

46views

వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. సోమవారం రాత్రి సూపర్‌ బ్లూ మూన్‌ ఆవిష్కృతం కాబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్‌ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పేర్కొంది. అయితే, ఈ సారి మాత్రం సూపర్‌ మూన్‌, బ్లూ మూన్‌ కలయికలో “సూపర్‌ బ్లూ మూన్‌” దర్శనం ఇవ్వబోతున్నది. పౌర్ణమి ఘడియల్లో చంద్రుడు 90 శాతం భూమికి దగ్గరగా వచ్చిన క్రమంలో సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. దాంతో సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతం ఉండడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడని నాసా వెల్లడించింది. సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ ఒకేసారి రావడం అరుదుగా జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ సారి సూపర్ బ్లూ మూన్ అనేది భారతీయులకు ఎంతో ముఖ్యమైన రాఖీ పండుగ రోజున రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు.