News

యుకె పాకిస్తానీలను ఆసియన్లనడం పట్ల హిందువుల అభ్యంతరం

47views

పాకిస్తానీ మూలాలు కలిగిన వారిని ఆసియన్లుగా గుర్తించడం హిందూ సంస్థలకు ఇష్టం లేకపోవడంతో యుకె ముస్లిం సంస్థలు ఆగ్రహిస్తున్నాయి. 2022 లెస్టర్ జరిగిన హింస సందర్భంగా పాకిస్తానీ మూలానికి చెందిన నిందితుడు మాంచెస్టర్ విమానాశ్రయంలో హిందువులపై నిర్దయగా దాడి చేసిన తర్వాత ఒకే మూలాలను పంచుకున్నవారమంటూ ముస్లిం సంస్థలు చేస్తున్న ప్రకటనలను హిందువులు తిరస్కరిస్తున్నాయి.

దీనితో, వారు హిందువులను నిందిస్తూ మాజీ ఫ్రీమన్ వంటి ఇస్లా మిస్టులతో కలిసి తమ అజెండాను కొనసాగిస్తు న్నాయి. దాడిచేసిన ముస్లింలను వర్ణించేందుకు ఆసియన్లు అనే పదాన్ని వాడటం పట్ల అయిష్టతను ప్రకటిస్తూ, అది గందర గోళాన్ని సృష్టించి, హిందూ, భారతీయ గుర్తింపును ముస్లిందాడిదారుల గుర్తింపుతో ఒకటి చేస్తుందని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ జులై 28వ తేదీన ఇన్సైట్ యుకె అనే హిందూ సంస్థ, సామాజిక మాధ్యమం ఎక్ష్స్ లో తమ ప్రకటనను పోస్ట్ చేసింది.

బ్రిటిష్ హిందూ, భారతీయ సమాజాలు ఉన్నత విద్యను అభ్యసించిన వారు, కలిసిపోయిన వారు, చట్టానికి కట్టుబడి ఉండేవారు కావడమే కాదు, యుకె వ్యాప్తంగా ఉన్న జాతిపరమైన మైనార్టీలలో అత్యధికంగా పన్నులు చెల్లించడమే కాక ఆర్థికవృద్ధికి, సామాజిక పురోగతికి దోహదం చేసేవారని ప్రకటించింది.అంతేకాదు, తమ అధికారులపై దాడి చేసిన వారిపై నిర్ణయాత్మక చర్య తీసుకున్న పోలీసులకు అండగా నిలబడతామని, జర్నలిస్టులు కూడా ఖచ్చితమైన, గౌరవనీయమైన ప్రాతినిధ్యాన్ని ఖరారు చేసేందుకు ఆసియన్ అన్న పదాన్ని వాడటాన్ని నివారించాలని విజ్ఞప్తి చేసింది.