News

ఘనంగా వరలక్ష్మీ వ్రతం

56views

రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత స్త్రీలు శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మహిళలు వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారని… ఈ రోజున అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాలు… ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వరలక్ష్మీ వ్రతాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.