
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను నిరసిస్తూ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో హిందూ చైతన్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. చైతన్యవేదిక కన్వీనర్ యల్లమిల్లి నాగసుధాకొండలరావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన సభలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఓలేటి సత్యనారాయణ మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మానవహారం నిర్వహించి దాడుల్లో మృతిచెందిన హిందువులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్‌కుమార్, నాయకులు బులుసు జగదీష్, ఉప్పుగంటి భాస్కరరావు, పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి, శిరంగు నాయుడు, పుత్సా కృష్ణకామేశ్వర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.





