News

దుర్గమ్మకు రామయ్య సారె

271views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఈవో ఎల్‌.రమాదేవి సారె సమర్పించారు. భద్రాద్రి దే వస్థానం ఈవో, అధికారులు రామయ్య సారెతో వెళ్లగా, వారికి దుర్గగుడి దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భద్రాద్రి దేవస్థానం తరఫున ఈవో సారెను సమర్పించారు. అనంతరం ఆమెకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. దుర్గగుడి ఈవో కేఎస్‌ రామారావు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.