News

అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి : టిటిడి ఈవో శ్యామలరావు

292views

అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని టిటిడి ఈవో ఈవో శ్యామలరావు తెలిపారు. దళారీ వ్యవస్థ నిరోధకానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జులైలో 22.33 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్లను పరిమితం చేశామన్నారు. శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకు వెయ్యి మాత్రమే జారీ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో సర్వదర్శన టోకెన్లు నెలకు 1.07 లక్షలు జారీ చేసేవారని పేర్కొన్నారు. జులైలో 1.47 లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేశామన్నారు.