News

ఆర్ఎస్ఎస్ లో ఉద్యోగులు చేరకుండా నిషేధించడం తప్పే : మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్య

70views

అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు పొందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను నిషేధ సంస్థల జాబితాలో పెట్టడం తప్పిదమని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి యాభై ఏళ్లు పట్టిందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడని సంస్థల జాబితాలో ఆర్ఎస్ఎస్ పేరును తప్పుగా పొందుపరిచిందని తెలిపింది.సంఘ్ అనేది ప్రజా ప్రయోజనం మరియు జాతీయ ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అని పేర్కొంది.

కార్యకలాపాల్లో కేంద్ర ఉద్యోగుల భాగస్వామ్యంపై నిషేధం కారణంగా సామాన్య పౌరుల ప్రాథమిక హక్కులు కూడా ఉల్లంఘించబడుతున్నాయని తెలిపింది. ఆర్ఎస్ఎస్ లో చేరి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించిన పలువురు కేంద్ర అధికారులు, ఉద్యోగులు నిషేధం కారణంగా దేశ సేవ చేయలేకపోయారు. నిషేధం విధించే ముందు ఎలాంటి సర్వే నిర్వహించలేదు లేదా వాస్తవాలను పరిశీలించలేదు.
ఎలాంటి నిర్దుష్టమైన ప్రాతిపదక లేకుండా ‘నిషేధ’ నిర్ణయం తీసుకున్నారు.సంస్థ సభ్యత్వం స్వచ్ఛందంగా ఉంటుంది. ఈ సంస్థ ధార్మిక, సామాజిక, పరోపకార మరియు విద్యా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.మరి ఇటువంటి విషయాల్లో పాలు పంచుకోనివ్వకుండా ఎవరినైనా సరే ఏ విధంగా నిరోధిస్తారు..?? భవిష్యత్తులో అలా చేసే ముందు నిశితంగా పరిశీలించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది

ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ కాండక్ట్‌ రూల్స్‌-1964, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఆఫీస్‌ మెమొరాండంలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

రిటైర్డ్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పురుషోత్తం గుప్తా దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. ఆరెస్సె్‌సలో ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేఽధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఈ నెల 9న జారీచేసిన మెమోను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రముఖంగా ప్రచురించాలని కేంద్ర హోంశాఖ, సిబ్బంది-శిక్షణ శాఖలను ఆదేశించింది.