ArticlesNews

మౌనమే గొప్ప శక్తి …

49views

మౌనం నుంచే మాట పుట్టింది. మౌనమే అన్నింటికన్నా గొప్ప దీక్ష’ అని భగవద్గీత చెస్తోంది. ఆ ఒక్క గీతను పట్టుకునే.. మౌనాన్ని ప్రాక్టీస్ చేశారు రమణమహర్షి, పవర్ ఆఫ్ సైలెన్స్’ని లోకానికి చూపించారు. ‘అన్నింటికన్నా ఉత్తమమైన ప్రార్థన మౌనమే’ అంటారు స్వామి వివేకానంద.ఈ ప్రపంచంలో మౌనమే గ్రేటేస్ట్ కమ్యూనికేషన్. మౌనమే యూనివర్సల్ లాంగ్వేజ్. మౌనమే శాశ్వత, దైవ భాష. మౌనమంటే పెదవి దాటకుండా మాటలకు అడ్డుకట్ట వేయడం కాదు సైగలతో, రాతలతో మనోభావాలను, సిద్ధాంతాలను మూగగా చెప్పడం కాదు. నిశ్శబ్దంగా ఆలోచించడం అంతకన్నా కాదు.

మౌనమే అంతరింద్రియ విజృంభణ … ఉద్రేకాల్ని ఆపడం. మనో, బుద్ధి, చిత్ర, ఆహాలతో కూడిన అంతఃకరణాన్ని అంతరింద్రియమంటారు. ఆలోచనలు, ఆవేదనలు, కోరికలు, కోపాలు, భయాలు, మాటలు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడమే మౌనం .. ఆత్మపై సంపూర్ణ ఏకాగ్రత కలిగి ఉండటమే మౌనం అదీ ఆలోచనలు లేని తపస్సు, సంతోషంతో నిండిన ఆత్మస్థితి. విషయ శూన్యావస్థ. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇనుమంత కూడా అహం పుట్టని స్థితే మౌనం..’యోగన్న ప్రథమం ద్వారం వాన్నిరోధ: అన్నారు. అంటే మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం. అదే సర్వానికి మూలం- సర్వస్వం మౌనంలోనే మొదలై, తిరిగి మౌనంలోనే లీనమౌతుంది. పాపాల పరిహారార్ధాలకు నిర్దేశించిన ఐదు శాంతుల్లో (ఉపవాసం,జపం, మౌనం,పశ్చాత్తాపం, శాంతి) మౌనం
యోగుల బాట కూడా…

యోగుల బాట కూడా మౌనమే. యోగి మాట్లాడకుండా ఆత్మ అనుభవ నిష్ఠుడై ఉంటారు. ఒకవేళ అతను మాట్లాడినా ‘నేను మాట్లాడాను’ అని అనుకోడు. ఇది చేయాలి. ఇది చేయాలి’ అనే సంకల్పాలే ఉండవు. ఏ. స్థితిలో ఉన్నా… ఏ కాలంలో ఉన్న ఆనందంగా సంతోషంగా ఉంటాడు. మౌనంలో మునిగిన వాళ్లు లోలోపల అనంతమైన ప్రశాంతతను అనుభవిస్తారు. మౌనరాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం’. అంటే వాక్కురు మనసుకు అందని పరమాత్మతత్త్వం మౌనంతోనే చూడగలం’ అని, దేవుడు ఒక వ్యక్తి కాదు. రూపం కాదు దేవుడంటే ఓ తత్త్వం. ఓ. సత్యం. దీన్ని మౌనంతోనే స్మశించగలం. గ్రహించగలం మౌనం శబ్ద ప్రపంచం కంటే అందమైంది. అర్జవంతమైంది. అత్యుత్తమైంది. అద్భుతమైంది. మౌనమే సత్యం, శివం. సుందరం ఇదే అమితమైన ఆనందం. ఇదే ఆత్మసాక్షాత్కారం. ఇదే మోక్షం…..