News

ఆగస్టు 18 నుంచి సప్తరాత్రోత్సవాలు

219views

కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్‌జోషిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తుల మదిలో నెలవైన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలను సప్తరాత్రోత్సవాల పేరిట నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 18న ధ్వజారోహణ, 19న శాకోత్సవం, 20న పూర్వారాధన, 21 మధ్వారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22న ప్రహ్లాదరాయల మహా రథోత్సవం, 23న సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన, 24న సర్వసేవా సమర్పనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. 18వ తేదీన రాఘవేంద్రస్వామి బృందావనానికి తితిదే అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా శ్రీమఠంలో విశేష పూజలు, ప్రహ్లాదరాయల పంచ రథోత్సవాలు, భక్తులకు అన్నదానాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యుల సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.