
382views
కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వేణుగోపాల స్వామి ఆలయ అర్చకుడు విజయ జనార్దనాచార్యులు హైదరాబాద్‌కు చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్స్‌లెన్స్–2024 అవార్డుకు ఎంపికయ్యారు. పదేళ్లుగా ఆలయ అభివృద్ధితో పాటు ధార్మిక సేవ, హిందూ సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెప్పేలా నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. సంస్థ అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి ఆధ్వర్యాన రాజమహేంద్రవరం నారాయణపురంలోని ఏపీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కమాండెంట్ డాక్టర్ కె.నరసింహారావు చేతుల మీదుగా జనార్దనాచార్యులుకు అవార్డు బహూకరించారు. కార్యక్రమంలో వెంకటాచారి, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.





