
221views
హిందూ ధర్మమే తనకు ప్రేరణనిస్తుందని, సాంత్వనను కూడా అందిస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుందని, గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు తనకు గర్వంగా వుందన్నారు. భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియోస్డెన్‌లో వున్న స్వామి నారాయణ్ మందిరాన్ని దర్శించుకున్నారు. హిందూ మతమే తనకు ఎప్పుడూ మార్గదర్శనం చేస్తుందన్నారు. నిజాయితీగా బతికినంత కాలం రాబోయే పర్యవసానాల గురించి చింతించాల్సిన అవసరమే లేదన్నారు. తన తల్లిదండ్రుల్లాగే తాను కూడా తన జీవితాన్ని అత్యంత సాధారణంగానే గడపాలని అనుకుంటున్నానని, తన కుమార్తెలకు కూడా ఇదే వారసత్వంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడిరచారు.





