News

ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం

72views

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. ఈ నలుగురిలో ఇద్దరు పోలీసు శాఖవారు, జలశక్తి నుంచి ఒకరు, విద్యాశాఖ నుంచి మరొకరు వున్నారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్‌ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వీరు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని, ఇస్లామిక్‌ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి, వారి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఇంటెలిజెన్స్‌ అధికారులు కొన్ని రోజుల క్రిందటే గుర్తించారు. వీరి చర్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వున్నాయని అధికారులు అభ్యంతరం తెలిపారు.

పోలీసు శాఖలో కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్న అబ్దుల్‌ రెహ్మాన్‌, రసూల్‌ భట్‌ లను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న షబీర్‌ అహ్మద్‌, జలశక్తి విభాగంలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా కొనసాగుతున్న అనయతుల్లా షా ఫిర్జాదాల ఉగ్రవాదాలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని విచారణలో తేలిందని వీరిని విధుల నుంచి తెలిపారు.