News

జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

92views

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 8న మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన నేతగా మోదీ నిలువనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే జూన్ 5న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 17వ లోక్ సభను రద్దు చేయాలని సిఫారసు చేసింది. 17వ లోక్ సభ కాలపరిమితి జూన్ 16వ తేదీ వరకు ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై మంత్రులతో ఆయన చర్చించారు.

నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని మోదీని కోరారు.