News

కళలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

67views

కళలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, దానిని కళాకారులు నాటికల ప్రదర్శన ద్వారా నేటి తరాలవారికి అందిస్తున్నారని, కళా పరిషత్‌లను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్‌ ఎన్టీఆర్‌ ట్రస్టీ డాక్టర్‌ పీ కృష్ణయ్య అన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులో శ్రీకారం రోటరీ కళా పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రారంభించిన 14వ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మార్టూరు లో రోటరీ కళా పరిషత్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను కళల రూపంలో సమాజంలో కళా కారులు ప్రదర్శించడం ద్వారా ప్రజలతో పాటు, ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయన్నారు. సభా కార్యక్రమానికి ముందు ఈ పోటీలను రోటరీ గవర్నర్‌ డాక్టరు బూసి రెడ్డి శంకరరెడ్డి నటరాజ విగ్రహం వద్ద పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం రొటేరియన్లు జీవీ సేతురామన్‌, వసంత సేతు రామన్‌ లకు రోటరీ కళా పరిషత్‌ వారు ముఖ్య అతిది కృష్ణ య్య చేతుల మీదగా సన్మానించారు.