News

పాఠ్య పుస్తకాల్లో ‘దేవరగట్టు’ సంబరం

82views

పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో దేవరగట్టు సంబరానికి అరుదైన గుర్తింపు దక్కింది. 2024-25విద్యాసంవత్సరానికి గాను పదో తరగతికి సంబంధించి నూతన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు, తెలియజేయడంలో భాగంగా పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయంలో జరిగే బన్నీ ఉత్సవాన్సి ప్రస్తావించారు. ప్రతిఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్ర, కర్రల ఊరేగింపు (సమరం) కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. ఆ వేడుకకు సంబంధించిన చరిత్రను తాజాగా పదోతరగతి తెలుగు వాచకంలో పొందు పరిచారు. భక్తులు, కర్రలు ఎందుకు తీసుకువస్తారు…? పండుగ ప్రత్యేకత, గుడి వద్ద పూజారులు వినిపించే భవిష్యవాణి, వసంతోత్సవం రోజున దేవరగట్టులో గోరవయ్యలు ఇనుప గొలుసు తెంపడం వంటి అంశాలను పా ఠ్యాంశంలో చేర్చారు. ప్రాచీన సం ప్రదాయ పండుగ దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఆలయ చరిత్ర, బన్నీ జైత్ర యాత్రపై తెలుగు కొత్త పాఠ్య పుస్తకంలో ప్రభుత్వం ప్రచురిం చడం అభినందనీయమని తెలుగు కవయిత్రి, ఉపాధ్యాయురాలు బత్తిన మహాదేవి అన్నారు.