News

ముస్లిముల దుశ్చర్య: ప్రైవేటు స్థలంలోని సంత్‌ కనకదాసు విగ్రహం బలవంతంగా తొలగింపు

84views

తెలంగాణలో ముస్లిములు హిందువుల విశ్వాసాలపై దాడి చేసిన మరో ఘటన వెలుగు చూసింది. కురవ కులస్తులు దైవంగా భావించి ఆరాధించే సంత్ కనకదాసు విగ్రహాన్ని బలవంతంగా తొలగించివేసారు. మే 22న ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని తీసేసిన సంఘటనపై పోలీసుల మౌనం హిందువులకు ఆగ్రహం కలిగిస్తోంది. కొంచెం ఆలస్యంగా వెలుగుచూసిన ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డిలో హిందూ ధర్మానికి చెందినక వారందరూ కనకదాసు జయంతి నాటికి ఆయన విగ్రహం ఒకటి శాశ్వతంగా నిర్మించుకుని అక్కడ పూజలు చేసుకోవాలని భావించారు. ఆ మేరకు తమ ప్రైవేటు స్థలంలో కనకదాసు విగ్రహం పెట్టుకున్నారు. మే 22న విగ్రహావిష్కరణకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచీ పూజలు, ఉత్సవం చేసుకుంటున్నారు. సుమారు 7 గంటల సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని ముస్లిములు మూకుమ్మడిగా అక్కడికి చొరబడ్డారు. ప్రశాంతంగా పూజలు చేసుకుంటున్నవారిని దూషిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తూ ఆ విగ్రహాన్ని తొలగించివేసారు.

గ్రామంలో సుమారు 800 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో ముస్లిం కుటుంబాలు 20 నుంచి 25 మాత్రమే ఉన్నాయి. అయినా వారు హిందువులను తమ పూజలు చేసుకోనీయకుండా హింసాత్మకంగా అడ్డుపడితే అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారంటూ గ్రామస్తులు వాపోయారు.