233views
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్‌లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో దాదాపు 90 శాతం ఇరాన్‌లోనే పండుతుంది. అక్కడ ఏటా 430 టన్నులు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇజ్రాయెల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ నుంచి కుంకుమపువ్వు సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో దేశీయంగా దీని ధర విపరీతంగా పెరిగింది. యుద్ధానికి ముందు టోకు మార్కెట్‌లో కిలో కుంకుమ పువ్వు ధర రూ.2.8 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండగా.. ఇప్పుడు రూ.3.5 లక్షల రూ.3.6 లక్షలకు చేరింది.





