
274views
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద శరవేగంతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు పరిశీలించారు. అభివృద్ధి పనుల పురోగతి గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. మల్లేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.





