
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ప్రారంభిక వర్గ-2024 శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుడివాడ, ఉయ్యూరు, కంకిపాడు, గన్నవరం ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారు.ఇంటర్మీడియట్, 10 వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతులకు చెందిన 22 మంది శిక్షార్ధులు ఈ ప్రారంభిక వర్గలో పాల్గొన్నారు.
అలాగే బంటుమిల్లి మండలం బంటుమిల్లిలో నిర్వహించిన ప్రారంభిక వర్గ-2024 శిక్షణా కార్యక్రమాన్ని అవనిగడ్డ, చల్లపల్లి, బందరు గ్రామీణ, బంటుమిల్లి, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్, 10 వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతులకు చెందిన 52 శిక్షార్ధులు ఈ ప్రారంభిక వర్గలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ అభ్యాసకులకు శిక్షణా కార్యక్రమం ద్వారా ప్రవర్తించే విధానం పై అవగాహన కల్పిస్తామని అన్నారు. శిక్షణార్థులు మూడు రోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకుని చక్కగా ప్రదర్శించారని కొనియాడారు.





