News

మే నెలలో తిరుమల విశేష ఉత్సవాలు.. వివరాలు ఇవే..

256views

తిరుమల వెళ్లే భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో మే నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. . మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.. మే 4న‌ సర్వ ఏకాదశి. మే 10న అక్షయతృతీయ.. మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి నిర్వహిస్తారు. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి ఉంటుంది. మే 23న శ్రీ అన్నమాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి నిర్వహిస్తారు.