
రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భగవత్ గారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో మాట్లాడిన ఆయన.. రిజర్వేషన్లకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్ అవుతోందన్నారు. సంఘ్ పరివార్ మొదటి నుంచి రాజ్యాంగం నిర్దేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దతిచ్చిందన్నారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనని చెప్పారు.
సమాజంలో బేధ భావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని విమర్శించారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.. సోషల్ మీడియాను మంచి కోసం వాడాలని హితవు పలికారు.





