ArticlesNews

హిందూ ధర్మంపై విషం కక్కుతున్న విధర్మీయులు

417views

భారతదేశంలో హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో హిందువులపై దాడులు, దౌర్జన్యాలతో పాటు హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మత మార్పిడి, లవ్ జీహాద్, దేవాలయ భూముల కబ్జా, గోహత్య వంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయాయి. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారానికి సంబంధించిన వార్తలు నిత్యకృత్యంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో హోలీ పండుగ జరుపుకుంటున్న హిందువులపై ముస్లిం మత ఛాందసవాదులు దాడి చేసిన ఘటన మరువకముందే హిందూ దేవతామూర్తులను అగౌరవపరిచిన ఉదంతం వెలుగుచూసింది.

హైదరాబాద్‌లోని కోఠి సుల్తాన్ బజార్‌లోని గ్లోబల్ ఎక్స్‌టెన్షన్ క్రీడా దుకాణంలో సీతారాముల చిత్రాన్ని ముద్రించిన లోదుస్తులను అమ్ముతున్నారు. దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు షాపు యజమాని సీతారాముల చిత్రంతో కూడిన లోదుస్తులను అమ్ముతున్నట్లు గ్రహించారు. దీంతో వారు స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు షాపులో తనిఖీ చేయగా సీతారాముల చిత్రాలతో కూడిన లోదుస్తులు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. దీంతో షాపు యజమాని అయిన మొహమ్మద్ ముజాహిద్‌ను అరెస్ట్ చేసి అతడిపై ఐపీసీ 295, 295(A), 153-A సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హిందూ దేవతా మూర్తుల చిత్రాలతో కూడిన లోదుస్తులను అబ్దుల్ రహీమ్ ముబిన్ సప్లయ్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ లోదుస్తులకు సంబంధించిన వస్త్రాన్ని సాధారణంగా హిందువులు తమ పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. ఆ వస్త్రాన్ని సేకరించి లోదుస్తులుగా మార్చి షాపులో విక్రయిస్తున్నారు.


లోదుస్తుల కోసం వినియోగించిన వస్త్రం పై సీతారాముల చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా, దాన్ని పట్టించుకోకుండా అబ్దుల్ రహీమ్ లోదుస్తులకు వినియోగించడం, వాటిని దుకాణ యజమాని మొహమ్మద్ ముజాహిద్‌ విక్రయించడం చూస్తుంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగానే కనిపిస్తోంది. ఇక, ఇలాంటి ఒక విష సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఓవైపు మత మార్పిడీలకు పాల్పడుతూనే మరోవైపు హిందూ చిహ్నాలు, దేవతలు మరియు హిందూ ధర్మాన్ని కించపరచడం క్రైస్తవ మిషనరీలకు నిత్యకృత్యంగా మారింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని హోలీ ట్రినిటి దైవ మందిరం పేరిట ఉన్న చర్చ్ నిర్వాహకులు తమ ప్రార్థన మందిరంలోకి ప్రవేశించే మార్గంలో హిందువులు పవిత్రంగా భావించే ఓం, స్వస్తిక్ చిహ్నాలతో కూడిన టైల్స్‌ను నేలపై పరిచారు. అంటే చర్చిలోకి ప్రవేశించాలంటే ఓం, స్వస్తిక్ చిహ్నాలను తొక్కుకుంటూ వెళ్లాలి. ఈ విధంగా సదరు క్రైస్తవ మత ప్రచారకులు హిందూ ధర్మంపై తమ అక్కసును ప్రదర్శించారు. దీనిపై స్థానిక హిందూ ధార్మిక సంస్థలు, గూడూరు స్వయం సేవకులు ప్రశ్నించడంతో సదరు చర్చ్ నిర్వాహకులు టైల్స్‌ను తొలిగించారు.


ఏదిఏమైనా, హిందువుల మనోభావాలను దెబ్బ తీయడం, దేవతా చిత్రాలను అవమానించడం అనేదాన్ని దేశంలోని ముస్లిం ఛాందసవాదులు, క్రైస్తవ మిషనరీలు తమ హక్కుగా భావించడం విచారకరం. ఇదేమని ప్రశ్నిస్తే, సెక్యులరిజం పై దాడి అని ఓ వర్గం గగ్గోలు పెడుతోంది. హిందుత్వంపై విషం కక్కుతూ తాము లౌకికవాదులమని కొందరు మేధావులు కలలు కనడం అవివేకం. సనాతన ధర్మంపై దాడి చేసేవారు భారత్‌లో హాయిగా తిరగగలుతున్నారంటే అది హిందువులు మంచితనమే. హిందూ ధర్మంపై విధర్మీయులు దాడి చేయడం, అవమానపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.