పర్యావరణంలో ప్రతికూల మార్పుల ప్రభావం దక్షిణాసియాలో అత్యంత కీలకమైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలపై పడుతోందని తాజా నివేదిక ఒకటి తెలిపింది. సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దాదాపు వంద కోట్లమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నివేదిక ప్రకారం- హిందుకుష్ హిమాలయాల్లోని మంచు, హిమానీనదాలు, అక్కడ కురిసే వర్షపాతమే ఆసియాలోని 10 అతిపెద్ద నదీ వ్యవస్థలకు మూలాధారాలు. గంగా బేసిన్ వల్ల భారత ఉపఖండంలో 60 కోట్లకు పైగా మంది ప్రయోజనాలు పొందుతుంటారు. అయితే పారిశ్రామికీకరణ, నగరీకరణ చాలా వేగంగా చోటుచేసుకుంటుండటంతోపాటు వ్యవసాయ విధానాల్లో అనుచిత మార్పుల కారణంగా ఈ నదీ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. నదీజలాల్లోకి పారిశ్రామిక వ్యర్థాలను ఇష్టారీతిన విడుదల చేస్తుండటం మానవ, పర్యావరణ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలంలో వరద విలయాలు, వేసవిలో తీవ్రస్థాయి నీటి కొరత కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, చైనాల్లో 26.8 కోట్లకుపైగా మందికి జీవరేఖగా భావించే సింధూ నది విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పర్యావరణ మార్పులతోపాటు డ్యాంల నిర్మాణం, అభివృద్ధి పనులు మితిమీరుతుండటం వల్ల బ్రహ్మపుత్ర బేసిన్లోనూ (ముఖ్యంగా దిగువ బేసిన్లో) వరదలు, కరవు ముప్పు పెరుగుతోంది.
345views
You Might Also Like
సింధూ నాగరికతను తామే నిజమైన వారసులం ప్రచారం చేస్తున్న పాకిస్తాన్..
48
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు సింధూ, దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్‌కు ‘‘సింధూ నది...
నీటి నిల్వలో అపర భగీరధులు
సృష్టిలో తొలుత జన్మించింది జలమని చెబుతారు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించింది నీరే (శాకున్తలం). ‘ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ ఉన్నచోటనే కాపురం పెట్టమన్నాడు సుమతీ శతక కర్త...
అయోధ్య నిధుల కేసు అత్యవసర విచారణకు తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
44
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో పిల్...
ఎమర్జెన్సీ వ్యతిరేకోద్యమ సారథి సంఘ్
అత్యవసర పరిస్థితిని విధించిన పది రోజులకి, జూలై 4,1975న నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మీద నిషేధం విధించింది. అదే సమయంలో నిషేధానికి గురైన...
గోమూత్రంతో చికున్‌గున్యాకు చెక్!
42
న్యూఢిల్లీ: భారతీయ సాంప్రదాయ జ్ఞానం, ఆధునిక శాస్త్రీయ పరిశోధనల సమన్వయానికి మరో ఉదాహరణగా నిలిచే ఆసక్తికర ఫలితాలను ఐఐటీ రూర్కీ పరిశోధకులు వెల్లడించారు. గోమూత్రం ఆధారంగా రూపొందించిన...
ముంబై హార్బర్ లైన్ రైళ్లలో క్రైస్తవ మత ప్రచార కరపత్రాలు
51
ముంబైలోని హార్బర్ లైన్ మార్గంలో నడిచే ఏసీ లోకల్ రైళ్లలో క్రైస్తవ మత ప్రచార కరపత్రాలు అంటించి ఉన్నాయి. పన్వెల్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్...





