News

అమెరికా, కెనడాల్లో రామ మందిర్ రథయాత్ర

271views

అమెరికా, కెనడాల్లో చేపట్టనున్న రామ్ మందిరం రథయాత్రను ఈ నెల 25న చికాగోలో ప్రారంభించనున్నట్లు ‘విశ్వ హిందూ పరిషత్ అమెరికా’ (వీహెచ్పీఏ) గురువారం తెలిపింది. మొత్తం 48 రాష్ట్రాల మీదుగా అరవై రోజులపాటు 8,000 మైళ్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. రథంలో సీతారాములు, లక్ష్మణ, హను మాన్ విగ్రహాలతోపాటు అయోధ్య రామమందిర ప్రత్యేక ప్రసాదం, కలశం, అక్షింతలు ఉంటాయని వీహెచ్పీఏ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ తెలి పారు. అమెరికాలో 851, కెనడాలో 150 ఆలయాలను ఈ సందర్భంగా సంద ర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ యాత్ర హనుమాన్ జయంతి రోజైన ఏప్రిల్ 23న ఇల్లినాయిస్ లోని సుగర్ గ్రోవ్ దగ్గర ముగుస్తుందని తెలిపారు. హిందూ ధర్మంపై అవగాహన తీసుకురావడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని హిందూ మందిర్ ఎంపవర్మెంట్ కౌన్సిలుకు చెందిన తేజల్ షా అన్నారు.