News

ఐఎన్‌ఎస్‌ సుమేధ యుద్ధనౌక వార్షికోత్సవం

251views

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధ యుద్ధనౌక వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించినట్టు నేవీ వర్గాలు తెలిపాయి. ఈ నౌక దశాబ్దం కిందట సముద్ర తీర రక్షణ, భద్రత గస్తీ విధుల్లో చేరిందని పేర్కొన్నాయి. అట్లాంటిక్‌, ఇండో- పసిఫిక్‌ సముద్ర ప్రాంతాల్లో పలు రకాల ఆపరేషన్లలో భాగస్వామ్యమైందని వెల్లడించాయి. ఈ సందర్భంగా నేవీ అధికారులు, సిబ్బంది నౌకను పరిశీలించి, ఫొటోలు దిగారు.