
289views
సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు శక్తిమంతమైన అస్త్రంతో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఎంహెచ్ 60ఆర్ సీహాక్ అనే ఈ హెలికాప్టర్‌ను తన అమ్ములపొదిలో చేర్చుకోనుంది. కొచ్చిలోని ఐఎన్‌ఎస్ గరుడలో ఈ లోహవిహంగానికి సంబంధించిన పరీక్షలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి.
సీహాక్ హెలికాప్టర్‌లో 38 లేజర్-గైడెడ్ రాకెట్‌లు, నాలుగు ఎంకే54 టోర్పిడోలు, మెషీన్ గన్‌లు.. శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి. హెలికాప్టర్ ముందు భాగంలోని ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణికి సంబంధించిన కచ్చితమైన చిత్రాన్ని ఆవిష్కరించగలవు. ఈ లోహవిహంగం.. ఒక ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు. క్షిపణి దాడులపై హెచ్చరికలు చేస్తుంది.





