News

తిరుపతి 894వ పుట్టినరోజు వేడుకలు

320views

తిరుపతి 894వపుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం నుంచి భారీగా కళాబృందాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కళాబృందాల ప్రదర్శనను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిటి కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డిలు ప్రారంభించారు. కళాకారుల ప్రదర్శన ఆద్యంతం నగర వాసులను ఆకట్టుకుంది. భక్తిపాటలతో తిరుపతి నగరం మ్రోగింది. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఆవిర్భావంపై శాసనాలు ఉన్నాయన్నారు. చిదంబరం నుంచి గోవిందరాజస్వామి ప్రతిమను తీసుకొచ్చారని..రామానుజాచార్యులు ప్రతిమను తీసుకొచ్చిన తరువాత తిరుపతికి గోవిందపురంగా నామకరణం చేశారన్నారు.తిరుపతి పుట్టినరోజు జరుపుకోవడం పూర్వజన్మ సుకృతమని..అందరూ భాగస్వామ్యులై పుట్టినరోజు పండుగను చేస్తున్నామన్నారు.

ప్రతియేటా తిరుపతికి పుట్టినరోజు వేడుకలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలతో సమానంగా తిరుపతి పుట్టినరోజును జరుపుకుంటున్నామన్నారు. టిటిడి ఇఓ ఎ.వి.ధర్మారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మాండాన్ని తిరుమల వేంకటేశ్వర స్వామి నిత్యం అనుగ్రహిస్తున్నాడని..తిరుమల తరహాలో తిరుపతిలో కూడా ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా చేస్తున్నామన్నారు.తిరుపతి నుంచే తిరుమలకు వెళుతుంటారు కాబట్టి తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తున్నామని..తిరుపతి అభివృద్ధికి టీటీడీ కూడా సహకరిస్తుందన్నారు.