
274views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో బాలరాముడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆలయ దర్శన వేళలు పెంచిన ట్రస్టు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామ్‌లల్లా దర్శనానికి రోజూ గంటపాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తెలిపారు. శుక్రవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చింది. రోజూ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు. గతంలో ఉన్న దర్శన వేళల్లో మార్పుచేశాక.. స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమాలు తెల్లవారుజామున 4.00 గంటలకే ప్రారంభమవుతున్నాయి. ఆ తర్వాత ఉదయం 6.00 మొదలు రాత్రి 10.00 గంటల వరకు రాములోరి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.





