
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో అక్రమ మదర్స కూల్చివేతలో జరిగిన హింసాకాండలో నష్టాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. అంచనా వేసిన నష్టం మొత్తాన్ని అల్లర్లకు కారకులైన అబ్దుల్ మాలిక్ నుండి వసూలు చేయనున్నట్లు ఇప్పటికే రికవరీ నోటీసు జారీ చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
కార్పొరేషన్ ఆస్తులను ధ్వంసం చేసేందుకు అబ్దుల్ మాలిక్, అతని సహచరులు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ పంకజ్ ఉపాధ్యాయ అన్నారు రూ.2 కోట్ల 44 లక్షల 52 వేల 500 నష్టాన్ని అంచనా వేశామని ఘటన సూత్రధారి అబ్దుల్ మాలిక్ నుంచి నష్టపరిహారం వసూలు చేయనున్నట్లు తెలిపారు.ఆ మొత్తాన్ని ఫిబ్రవరి 15వ తేదీలోపు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసే ముందు దుండగులు వందసార్లు ఆలోచించేలా ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా మునిసిపల్ కార్పోరేషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఫిబ్రవరి 8న, మునిసిపల్ కార్పొరేషన్ మరియు పోలీసు అడ్మినిస్ట్రేషన్ బృందం ఆక్రమణలను తొలగించడానికి బంబుల్‌పురా మాలిక్‌కు చెందిన బాగీచా అనే ప్రదేశానికి వెళ్ళింది. ఈ సమయంలో, రాళ్లదాడి, దహనం, విధ్వంసం మరియు అల్లర్లు కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు దగ్ధమయ్యాయి.
బంబుల్‌పురా ఘటన తర్వాత దేవభూమిలో ఇలాంటి అరాచకాలను సహించేది లేదని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి పైసా రికవరీ అవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యంత్రాంగం ఈ మేరకు చర్యలు తీసుకుంది.





