
416views
ఈ నెల 14 నుంచి 18 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర ప్రాణ ప్రతిష్టో త్సవం నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. మల్లేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరడంతో దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అర్చకులు దేశంలోని జీవనదుల నుంచి పవిత్ర జలాన్ని అభిషేక నిమిత్తం తీసుకురానున్నట్లు తెలిపారు. స్వర్ణ శిఖర నిర్మాణానికి అవసరమైన పనులు ముందుగానే పూర్తి చేసినట్లు తెలిపారు. ధ్వజస్తంభానికి బంగారు తొడుగు, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు.





