
తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వన దేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొనేందుకు ఆదివారం భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వేలా దిగా వచ్చిన భక్తుల వాహనాలతో మేడారంలోని పార్కింగ్ ప్రదేశాలన్నీ నిండిపోయాయి. రహదారులన్నీ కిటకిటలాడాయి. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన భక్తుల రాక రాత్రి వరకు కొనసాగింది. అందరూ జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేశారు. జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. గద్దెల ప్రాంగణానికి వచ్చి ఎత్తుబెల్లం, ఒడిబియ్యం, పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వ హించారు. చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, శివరాంసా గర్ చెరువు తదితర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి రోజంతా ఆటపాటలతో గడిపారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంర్రావు, కార్యనిర్వహ ణాధికారి రాజేంద్రం ఏర్పాట్లను సమీక్షించారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకొన్నారు.





