
298views
అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం కవరేజీలో బీబీసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ మండిపడ్డారు. తాజాగా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆయన మాట్లాడుతూ… అయోధ్యలో రామాలయం ప్రారంభం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. అయితే బీబీసీ మాత్రం ‘ఇది ఒక మసీదు విధ్వంసం జరిగిన ప్రదేశం’ అని తన కవరేజీలో నివేదించిందని ఆరోపించారు. మసీదు కంటే 2వేల సంవత్సరాలకు ముందు అక్కడ దేవాలయం ఉందన్న విషయాన్ని బీబీసీ మర్చిపోయిందన్నారు. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ఐదెకరాల స్థలం కేటాయించారని చెప్పారు. బీబీసీ నిష్పక్షపాతంగా రిపోర్టింగ్ చేయడంలో వైఫల్యంపై చర్చకు సమయం కేటాయించాలని ఇతర ఎంపీలను బ్లాక్‌మన్ కోరారు.





