
249views
రామ భక్తులందరూ బిజేపి మద్దతుదారులు కాదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అన్నారు. ‘‘నేనుగానీ, కాంగ్రెస్ పార్టీ గానీ రాముడ్ని భాజపాకు ఎందుకు వదిలేయాలి? నాతో సహా చాలామంది రామ భక్తులం. భవిష్యత్తులో మేం అయోధ్యకు వెళితే అది మా భక్తిని చాటుకోవడానికి మాత్రమే. లౌకికవాదమంటే మతం లేకపోవడమని కాదు, ‘బహుళత్వవాదం’ అని దాని అర్థం. అంటే నచ్చిన మతాన్ని ఆచరించడం. అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలని ప్రతి హిందువూ కోరుకుంటారు. కానీ ఆలయాన్ని కట్టడం కోసం మసీదును కూల్చేయాల్సిన అవసరం లేదని నేను ముందునుంచీ చెబుతూనే ఉన్నా’’ అని థరూర్ వ్యాఖ్యానించారు. కేరళ విద్యార్థి సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంగళవారం శశిథరూర్ పాల్గొని ప్రసంగించారు.




