
ఇప్పటికే హిందూ దేవాలయాల్లో భక్తులను దేవాలయ దర్శనానికి దూరం చేయాలనే ఉద్దేశంతో దర్శనాల టికెట్ల రేటులను విపరీతంగా పెంచి, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.హిందువులను నిలువుదోపిడీ చేస్తూ తాజాగా ఇప్పుడు మరో చర్య తీసుకుంది. పలు రకాల హిందూ వివాహ నమోదు ఫీజులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం సాధారణ వివాహ నమోదు ఫీజు రూ.200 ఉండగా వాటిని రూ.500కు పెంచింది. అలాగే వివాహ వేదిక వద్దే సబ్‌రిజిస్ట్రార్ వస్తే గతంలో రూ.210 రుసుము ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ.5000కు పెంచింది. ప్రభుత్వ సెలవు రోజుల్లో వివాహాల నమోదు ఫీజును రూ.5వేలుగా నిర్ధారించింది.
మ్యారేజ్ రికార్డుల పరిశీలన ఫీజును రూపాయి నుంచి రూ.100కి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జరిగి ఏడాది పూర్తయినా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని అన్నారు. హిందువులపై ప్రభుత్వ వ్యతిరేకతకు ఇటువంటి చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిందూ దేవాలయాల్లో కానీ, హిందువుల విషయం దగ్గరికి వచ్చేప్పటికి అన్ని ధరలూ దారుణంగా పెంచేస్తున్నారు.హిందువుల సొమ్ముతో ఖజానా నింపుకుంటున్నారు. ఆ సొమ్మును మసీదుల్లో ముల్లాలు, మువజ్జమ్‌లకు, చర్చి పాస్టర్లకు గౌరవ వేతనాల పేరుతో, వారి ప్రార్థనాస్థలాల నిర్మాణాల పేరుతో పందేరం చేస్తున్నారు. హిందూ, హిందూయేతరల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వవైఖరి గర్హనీయం.




