News

కృష్ణుడి ఆలయం నిర్మించే వరకూ ఒక్కపూటే భోజనం

852views

మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగేవరకూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తానని రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ ప్రతిజ్ఞ చేశారు. రామమందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన మదన్‌ దిలావర్‌ అనేక ఏళ్ల క్రితం చేసిన ప్రతిజ్ఞను వీడారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం మాలను ధరించి సోమవారం దీక్షను విరమించారు. ఈ సందర్భంగా తన కరసేవ జ్ఞాపకాలను వివరించిన మదన్‌ దిలావర్‌ మరో ప్రతిన బూనారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మథురలో కృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగే వరకు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తానని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ్‌గంజ్‌ మండి సిటీలో జరిగిన ర్యాలీలో దిలావర్‌ డమరుకం వాయించారు.