
278views
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఆన్‌లైన్‌లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనను టికెట్లు టిటిడి విడుదల చేసింది. అలాగే అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను ఆన్‌లైన్ లో విడుదల చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం 300రూపాయల టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని.. ఈ విషయాన్ని గమనించి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.





