
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెటర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమానికి పలువురు ఆటగాళ్లకు ఆహ్వానాలు అందాయి. విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ఆటగాళ్లూ ఈ వేడుకపై స్పందించారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు.
‘‘నమస్తే.. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చా. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నా. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్’’ అని కేశవ్ తెలిపాడు. భారత్ ఇటీవల సఫారీల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీరాముని పాటలు వినిపించాయి. అప్పుడు కేశవ్ స్పందిస్తూ.. తాను ఎప్పుడు మైదానంలోకి దిగినా ఇలాంటి పాటలు వినిపించేలా చేశారని ఆనందం వ్యక్తం చేశాడు.
My favourite overseas player Keshav Maharaj sends his wishes in regards to Ram Mandir pran-pratistha samaroh in Ayodhya pic.twitter.com/PIOi8cfEDQ
— Squint Neon (@TheSquind) January 21, 2024




