
170views
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలను ఉంచి అర్చన చేశారు. శ్రీరామ రథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ‘జై శ్రీ రామ్’ నినాదాలతో కాషాయ జెండాలను ఊరేగించారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.




