News

నేడు తుది కక్ష్యలోకి ఆదిత్య-ఎల్‌1

252views

సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న నింగిలోకి పంపిన ఆదిత్య-ఎల్‌1ను శనివారం సాయంత్రం తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్‌ నింగిలోకి వెళ్లాక నాలుగు విన్యాసాలు, ట్రాన్స్‌ లగ్రాంజియన్‌ పాయింట్‌-1 ఇన్సర్షన్‌ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇది శనివారం 63 నిమిషాల 20 సెకన్లపాటు ప్రయాణించాక ఆదిత్య-ఎల్‌1 అంతరిక్ష నౌకను భూమి చుట్టూ 235్ల19500 కి.మీ. దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య-ఎల్‌1 భూమి నుంచి సుమారు 1.5 మిలియన్‌ కి.మీ. దూరంలోని మొదటి సూర్య-భూమి లగ్రాంజియన్‌ పాయింట్‌(ఎల్‌1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించడానికి రూపొందించిన తొలి భారత అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా నిలవనుంది.