
243views
రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో ముస్లిం పక్ష పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్ అన్సారీకి రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రావాల్సిందిగా శుక్రవారం ఆహ్వానం అందింది. ట్రస్టు ప్రతినిధులు తన ఇంటికి వచ్చి ఆహ్వానం అందించడంపై హర్షం వ్యక్తం చేసిన అన్సారీ ప్రాణప్రతిష్ఠ వేడుకకు తప్పక హాజరవుతానని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును తామందరం గౌరవిస్తామని, అయోధ్య అన్ని మతాల సౌభ్రాతృత్వంతో కూడిన దేవభూమి అని పేర్కొన్నారు.





