
231views
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి, సీల్డ్ కవర్‌లో అందించిన నివేదికను బహిర్గతం చేసే విషయమై వారణాసి కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఉత్తర్వు ప్రతి ఇంకా సిద్ధం కాలేదని జిల్లా జడ్జి ఎ.కె.విశ్వేష్ శుక్రవారం తెలిపారని, శనివారం దానిని వెల్లడించే అవకాశం ఉందని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు. మరో నాలుగు వారాల పాటు తమ నివేదికను బహిర్గతం చేయవద్దని ఏఎస్‌ఐ బుధవారం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. గత జులై 21న జిల్లా కోర్టు ఆదేశించడంతో కాశీ విశ్వనాథ ఆలయం చెంతనున్న జ్ఞానవాపి ప్రాంగణంలో ఏఎస్‌ఐ శాస్త్రీయ పరిశోధనలు చేపట్టిన విషయం తెలిసిందే.





