
375views
అయోధ్యలో రామ మందిర పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. గర్భగుడిలో 51 అంగుళాల ‘బాల రాముడి’ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అయోధ్య ఆలయ విశేషాలను శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ పంచుకుంది.





