News

ట్రిపుల్ తలాక్ బిల్లుకు మేం వ్యతిరేకం: జేడీయూ

849views

ట్రిపుల్ తలాక్ చట్టం  చట్టబద్ధత కోసం ఎన్డీఏ సర్కార్ విశేషంగా కృషిచేస్తోంది. అయితే ఇదివరకు ఆ బిల్లు లోక్‌సభలో గట్టెక్కినా రాజ్యసభలో వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తమ కూటమి పక్షాలను కలుపుకొని వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అయితే జేడీయూ రూపంలో మిత్రపక్షమే అందుకు అడ్డు తగులుతూ ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము మద్దతు తెలుపబోమని జేడీయూ ప్రకటించడం చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు ప్రస్తుత పరిస్థితుల్లో సపోర్ట్ చేయబోమని తేల్చిచెప్పింది. ఈ బిల్లుపై సభలో చర్చ జరిగితే తమ 16 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటేస్తారని తేల్చిచెప్పింది జేడీయూ.