News

సియాచిన్‌ మంచు శిఖరంపై తొలి మహిళా ఆర్మీ అధికారి విధులు

205views

సైన్యానికి చెందిన కెప్టెన్‌ గీతిక కౌల్‌ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో విధులు నిర్వర్తించనున్న తొలి మహిళా మెడికల్‌ ఆఫీసర్‌గా నిలిచారు.సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉండే సియాచిన్‌లో విపరీతమైన చలి ఉంటుంది.

ఇక్కడ విధులు నిర్వర్తించడమనేది సాహసంతో కూడుకున్నది. అలాంటి ప్రదేశంలో పనిచేయాలంటే శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఎంతో కఠోరమైన శిక్షణలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ శిక్షణను గీతిక కౌల్‌ విజయవంతంగా పూర్తి చేశారు.